Tuesday, April 30, 2024

పేదల అభ్యున్నతికి సేవాభారతి కృషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సేవా భారతి అనుబంధంతో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి సామాజిక సేవ ఆశయాలు నెరవేరుతున్నాయని ఇన్ఫోసిస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ్ అన్నారు.సేవాభారతి నిర్వహించే కిషోరి వికాస్ యోజన, జిడిఏ కార్యక్రమానికి శుక్రవారం ఇన్ఫోసిస్ సిఎస్‌ఆర్ నిధులను చెక్ రూపంలో అందించింది. సేవా భారతి ఎన్జీవో 33 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేస్తుంది.

రాష్ట్రంలోని 30 జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ప్రకృతి విపత్తులలో సేవ, అనాధ బాల బాలికల పునరావాసం మొదలగు రంగాలలో సేవా భారతి నిర్వహిస్తుంది. సేవాభారతి కోశాధికారి హరీష్ చోల్లేటి మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా పైబడి సేవాహీ పరమోధర్మః అనే సంకల్పంతో అట్టడుగు స్థాయి వర్గాల అభ్యున్నతికై నిరంతరం సేవా భారతి (తెలంగాణ శాఖ) ప్రయత్నం చేస్తుందని చెప్పారు. బోయినపల్లిలోని సేవా భారతి తెలంగాణ జిడిఎ (జనరల్ డ్యూటీ అసిస్టెంట్) శిక్షణ కేంద్రంలో జరిగిన సిఎస్‌ఆర్ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు, ప్రధాన అధికారి కుల్ దీప్ సక్సేనా, నిర్వాహకురాలు శ్రీవిద్య పాల్గొన్నారు. జడిఎ కార్యక్రమం వివరాలకు 93983 12414 ఫోన్‌నంబర్‌లో సంప్రదించగలరని నిర్వాహకులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News