రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన సదరు వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.91 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు పుణె నుంచి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించామని వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.