Tuesday, April 23, 2024

కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!

- Advertisement -
- Advertisement -

CM-KCR

అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న

అధినాయకుడూ అంతే — అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే కాదు, బతుకులూ కూలుతాయని గ్రహించి పటిష్టమైన పునాది ఏర్పరిచేందుకు పగలూ రేయీ కష్టిస్తున్నారు మన కెసిఆర్. పరాయి పాలనలో ఆరు దశాబ్దాలకు పైగా కూనారిల్లిన రాష్ట్రం కోలుకునేందుకు ఆరు సంవత్సరాల కాలం సుదీర్ఘమైనదేమి కాదు, కావునే, ఆరు సంవత్సరాల అధినేత కృషికి పటిష్టమైన పునాది మాత్రమే పెద్దది, అయితే ఈ పునాది అత్యంత పటిష్టమైనది, ఆకాశ సౌధానికి అంకురమైనది.

పట్టెడు అన్నం – పిడికెడు ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ సారధి పాలకుడైన తరువాత ఆ రెండింటికి పూచి పడ్డారు. తడారి పోయిన నేల తల్లి ఎడారిగా మిగలడం ఇష్టం లేక సాగు నీరు, – త్రాగు నీటిపై మొదటగా దృష్టి సారించారు, అపర భగీరథుడుగా అవతారమెత్తారు. రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రమే అయినా అకుంఠిత దీక్షతో అడుగు ముందుకు వేశారు, ఫలితమే కాళేశ్వరం. తెలంగాణ రైతన్నలపై కెసిఆర్‌కు ఉన్న తరగని మమకారానికి తిరుగులేని సాక్ష్యం. స్వతహాగానే కెసిఆర్ రైతు బిడ్డ, రైతన్నల చెమట చుక్కల విలువేమిటో తెలిసి పెరిగారు కాబట్టి రాష్ట్రానికి అధినేత అయినా ఇప్పటికీ రైతుగానే బతుకుతున్నాడు. ఒక నాడు మెతుకు సీమలో నేడు బంగారు పంటలు స్వయంగా పండిస్తూ ఆదర్శ రైతుగా ఎదిగి, తనలాగే రైతన్నలంతా ఎదగాలని పరితపించి, అందుకు పథక రచన చేస్తున్నారు.

దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా రెండు పంటలకు గాను ఎకరానికి 10 వేల రూపాయాల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అలాగే, ఏ కారణం చేతైనా రైతన్న అర్థాంతరంగా తనువూ చాలిస్తే ఆ కుటుంబం వీధినపడకుండా ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానంగా చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణాలో చెరువుల పునరుద్ధణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఊరు చెరువునూ జల సిరులతో నింపారు. కరెంటు కోసం రైతన్నలు పడుతున్న అష్టకష్టాలు తీర్చేందుకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర కరెంటును అందిస్తున్నారు. అలాగే, ఆడబిడ్డలు తాగు నీటి కోసం పడుతున్న కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే చర్యలు తీసుకొని, ప్రజల ధూప తీర్చిండు. మొత్తముగా తెలంగాణాలో కోటి ఎకరాలకు ఎలాంటి కొరత లేకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా అనేక నీటి పారుదల ప్రాజెక్ట్ లను రూపొందించి పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఎడారిని పోలిన పాలమూరు నుండి వలసలను అరికట్టి సొంత పల్లెలలోనే భద్రమైన జీవితం అందించేందుకు పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఇక వయస్సు మీద పడిన వృద్ధులు, దివ్యాంగులు తమ కనీస ఆర్థిక అవసరాల కోసం వేరొకరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతికేందుకు వృద్ధులకు నెల నెలా రూ.2016, దివ్యాంగులకు రూ.3016 అందిస్తున్నారు. గర్భిణీలు జన్మించిన పండంటి బిడ్డను ఆరోగ్యంగా పెంచేందుకు రూ.12000, ఆడబిడ్డల భవిష్యత్ రక్షణకు పుట్టగానే రూ.13000, మాతా శిశు ఆరోగ్య రక్షణకు కెసిఆర్ కిట్లు అందిస్తున్నారు.

విద్య అవసరం అందరికన్నా మిన్నగా తెలిసిన మేధావి మన కె.సి.ఆర్. – విద్య మనిషిని ఉన్నతంగా తీర్చి దిద్ది, ఆత్మగౌరవంతో, సుఖసంతోషాలతో బతికేందుకు తోడ్పడే అత్యున్నత సాధనమని భావించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో అణగారిన కులాల బిడ్డలకు వందలాది గురుకులాలు స్థాపించారు. అలాగే, కుటుంబ ఆర్థిక లేమితో పౌష్టికాహారాన్ని దూరమవుతున్న పిల్లల కోసం సన్న బియ్యం, గుడ్డుతో కూడిన పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. విద్యపై ముఖ్యమంత్రికి ఉన్న మక్కువ కారణంగా తెలంగాణ విద్యా రంగంలో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను అందుకుంటోంది.

ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేసేందుకు అప్పులపాలు కానీ పేద కుటుంబం లేదు. ఆ అప్పులు తీర్చేందుకు పడే అష్టకష్టాలు తీర్చి తల్లిదండ్రుల గుండె భారం తీర్చేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద ఆడబిడ్డల పెండ్లికి రూ.100116 -ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తున్నడు. బస్తీ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు విస్తృతంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. అలాగే, పేదలకు మెరుగైన గృహ వసతి కల్పించేందుకు దేశం లోనే మొదటి సారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఐ.టి. రంగానికి దిక్సూచి మారుతుంది, ఆ ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుంది. ఇక, కుల వృత్తులలో ఉన్న అణగారిన కులాల వృత్తిదారులు ఆ వృత్తులను ఆధునీకరించుకొని, ఆ వృత్తుల ద్వారానే ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ, గంగ పుత్రులు, ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, చేనేత కార్మికులకు రుణాల మాఫీ సబ్సిడీపై ముడి సరుకులు. ప్రభుత్వం వృత్తి దారులకు అందిస్తున్న ఆసరాగా పథకాలలో మచ్చుకు కొన్ని. సకల జనులూ ఆత్మగౌరవంతో, ఆర్థిక పరిపుష్టితో బతికేందుకు సకల చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు కెసిఆర్.

అదేవిధంగా ఈ రోజు తెలంగాణ వచ్చింది పరిపాలన వికేంద్రీకరణ కోసం అందులో భాగంగానే కొత్త గ్రామం పంచాయతీ లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, కొత్త గా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కెసిఆర్ గొప్పఆలోచన విధానం, విప్లవాత్మకమైన మార్పు అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల కు ప్రభుత్వం పథకాలు ప్రతి పౌరుడికి ఫలితాలు అందాలని కెసిఆర్ గారి మహోత్తరమైన ఆలోచన విధానం. అదేవిధంగా యువ నాయకుడు మునిసిపాల్టీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో జరుగుతున్నాయి. గతంలో కేటిఆర్ ఏ ఎన్నికలుకు నాయకత్వం వహించినా విజయ ఢంకా మోగించారు… తెలంగాణ ప్రజలు కూడా కేటిఆర్ గారి నాయకత్వాన్ని ప్రజాస్వామికమైన ఓటు ద్వారా బలపరిచారు. తెలంగాణ ప్రజలు మరొకసారి కెసిఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన సమయం ఆసన్నమైంది. కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మన అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, పట్టణాల అభివృద్ధి కోసం నాంది పలకాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే….
‘తెలంగాణకు కె.సి.ఆర్. దేవుడు ఇచ్చిన వరం,
ఆయన జీవితం తెలంగాణకే అంకితం,
కెసిఆర్ తెలంగాణకు ఒక అవ సరం.. అనివార్యం..
ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు
కెసిఆర్‌ను మనం కాపాడు కుందాం…..
కెసిఆర్ మనలను కాపాడు కుంటారు…’

 

Special Story on Telangana CM KCR

                                                                                      గోసుల శ్రీనివాస్ యాదవ్, 9849816817
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News