Monday, May 13, 2024

లంకకు తొలి గెలుపు

- Advertisement -
- Advertisement -

లక్నో : ప్రపంచకప్‌లో శ్రీలంక తొలి విజయం అందుకుంది. శనివారం లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక ఐదు వికెట్ల తేడా తో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో లంకకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచుల్లోనూ లంక ఓటమి పాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసి ఆలౌటైంది. ఒక దశలో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ను సైబ్రాండ్, వాన్ బీక్ ఆదుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన సైబ్రాండ్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేశాడు. బీక్ 59 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ పథుమ్ నిసాంకా 9 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన సదీరా సమరవిక్రమ అజేయంగా 91 పరుగులు చేసి లంకను గెలిపించాడు. అతనికి చరిత్ అసలంక (44), ధనంజయ డిసిల్వా (30) అండగా నిలిచారు.

Also Read: నేడు సద్దుల బతుకమ్మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News