Saturday, January 28, 2023

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట్ శివారులో గురువారం రైలు కిందపడి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన రాకేష్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న రాకేష్ సంక్రాంతి సెలవులకు వచ్చి తిరిగి కరీంనగర్ కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో నుండి బయలుదేరినట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles