Tuesday, September 10, 2024

పెద్దపూర్ గురుకులంలో కలకలం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రెండు వారాల క్రితం జరిగిన సంఘటన మరువకముందే అస్వస్థతతో మరో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. గతనెల 26న (శుక్రవారం) మొదటి సంఘటన జరిగిన తీరునే సరిగా 14 రోజుల తరువాత శుక్రవారం అలాంటి సంఘటన జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి భోజన అనంతరం విద్యార్థులందరూ పడుకోగా అర్ధరాత్రి 12 గంటల తరువాత ఆరవ తరగతి చదువుతున్న అనిరుధ్ కడుపులో నొప్పి ఉందని తోటి విద్యార్థులకు తెలిపాడు. అనంతరం ఏడుస్తునే పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు అందర్నీ నిద్రలేపారు.

అప్పటికీ అనిరుధ్ కడుపులో బాగా నొప్పి ఉందంటూ ఏడవడంతో కేర్ టేకర్ మదనయ్య మరొకరి సహాయంతో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అదే తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు హేమంత్, మోక్షిత్ అస్వస్థతకు గురికాగా వారిని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోక్షిత్ ఆరోగ్య పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేటకు చెందినట్లు గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News