Saturday, April 27, 2024

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

supreme court

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబందించి నాలుగు వారాల్లో విచారణ పూర్తిచేయాలని హైకోర్టును ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన జీవోపై స్టే విధించడంత ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో 50శాతం మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు దానిపై స్పందించకుండా ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని ఆదేశాలను జారీచేసింది. ఈ క్రమంలో పిటిషనర్ ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Supreme Court Stay on Local Body Elections in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News