Sunday, June 2, 2024

ఫ్రెండ్‌షిప్ ఆధారంగా…

- Advertisement -
- Advertisement -

Suryasthamayam movie pre release event

 

ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సూర్యాస్తమయం’. శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను వి.సముద్ర, ఆర్.పి.పట్నాయక్ కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బండి సరోజ్ మాట్లాడుతూ “రెండేళ్ల ముందే ఈ సినిమాను సిద్ధం చేశాం. కానీ కోవిడ్ కారణంతో సినిమాను రిలీజ్ చేయలేకపోయాం. చివరికి ఈ నెలాఖరున ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. క్రాంతి కుమార్ తోట మాట్లాడుతూ “ఫ్రెండ్‌షిప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బండి సరోజ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు”అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News