Thursday, April 25, 2024

ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తప్పవు

- Advertisement -
- Advertisement -

occupy-footpath

నిజాంపేట: ఫుట్‌పాత్‌లను అక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత వ్యాపారస్తులకు హెచ్చరించారు. బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల డివిజన్‌లో గల పలు ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను ఆమెతో పాటు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, ఎఎంఓహెచ్ సంపత్ కుమార్‌లు పర్యటించి పరిశీలించారు. జీడిమెట్ల విలేజ్, కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం రోడ్డు, మినాక్షిఏస్టెట్ కాలనీలలో జరుగుతున్న ఫుట్‌పాత్ పనులను, వెన్నలగడ్డలోని చెరువు రిటర్నింగ్ వాల్ పనులను, కృష్ణకుంచ్ వద్ద గల జంక్షన్ అభివృద్ధి పనులను, కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరం పునరుద్దరణ పనులను ఆమె పరిశీలించారు.

ఈ పర్యటనలో పుట్‌పాత్ రహదారిని అక్రమించినందుకు, షాపుల ముందు ట్విన్ బిన్స్ లేనందుకు ఐదుగురికి రూ.13000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రహదారులకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలంలో పేరుకపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఎ, ఎస్‌జె. ఎస్‌ఎస్‌లకు ఆదేశించారు. పనులలో నాణ్యత లోపించకుండ వేగవంతం చేయాలన్నారు. పూట్‌పాత్‌లను అక్రమిస్తే జరిమానాలు విధించాలని డిసికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

taken action against Shops who occupy footpath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News