Friday, September 19, 2025

మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలి: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రతాదళాల దాడులతో కర్రెగుట్టల్లోని ఆదివాసీలు బయటకు రావడం లేదని మంత్రి సీతక్క తెలిపారు. ఆపరేషన్ కగార్ పై సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అడవుల్లోకి వెళ్లొద్దని చెప్పడంతో ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలని సూచించారు. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యగా పరిగణించాలని సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News