Saturday, May 4, 2024

ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన కలెక్టర్ రాజాబాబు, అధికారులు
అనంతరం ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరు

మన తెలంగాణ/ హైదరాబాద్: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను శనివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. కనక దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుండి తొలుత ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళసైకు దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరపున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఇచ్చారు. చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య- ఎల్ 1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై తెలిపారు.

Tamil Isai 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News