Wednesday, August 6, 2025

300 లీటర్ల చనుబాలను దానం చేసిన మహిళ

- Advertisement -
- Advertisement -

తిరుచ్చిరాపల్లి జిల్లా లోని కట్టూర్‌కు చెందిన 33 ఏళ్ల సెల్వ బృందా తన చనుబాలను 300 లీటర్లకు పైగా దానం చేసింది. తిరుచ్చి లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిపాల బ్యాంకుకు ఈ పాలను విరాళంగా ఆమె అందించారు. ఈ విరాళం 2023 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 22 నెలల కాలంలో జరిగింది. సెల్వ బృందా ఇద్దరు పిల్లల తల్లి. అమృతం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోత్సాహంతో ఈ విరాళం అందించారు.వేలాది మంది శిశువులకు ఈ చనుబాలు ఆదుకుంటుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 202324 లో ఆస్పత్రిలో సేకరించిన మొత్తం తల్లిపాల బ్యాంకులో బృందా అందించిన విరాళం సగానికి పైగా ఉంటుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో బృందాకు చోటు లభించడం విశేషం. ఆగస్టు 7న ప్రపంచ స్తన్య పోషణ వారం సందర్భంగా పాలబ్యాంకులోని అధికారులు ఆమెను సత్కరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News