Sunday, May 5, 2024

చంద్రబాబుకు మద్దతుగా ‘ మోత మోగించి’న టిడిపి నేతలు

- Advertisement -
- Advertisement -

జగన్ పాలనకు వ్యతిరేకంగానే ఈ మోత: కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైలులో ఉంచిన ఆంధ్రప్రదేశ్ వైసిపి ప్రభుత్వానికి నిరసనగా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ “మోత మోగిద్దాం” పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా నిర్వహించారు. ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగా వివిధ శబ్దాలు చేసి ‘మోత మోగించినట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.

దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు చంద్ర బాబు నాయుడు అన్నారు. విజన్ 2047తో ప్రజలందరినీ అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన ఒక విజన్ తో..ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అలాంటి గొప్ప నేతను విజన్ కాదు రిజైన్ గా చేయాలన్న ఆలోచనతో జగన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవరిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. దూరద్రుష్టి గల విజనరి లీడర్ ను జైలు పాలు చేసే దుస్థితికి తేవడం అన్యాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, నేడు ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక, అనాగరిక చర్య అని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ, పనబాక లక్ష్మి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజు నాయక్, జివిజి నాయుడు, షేక్ ఆరిఫ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు, సూర్యదేవర లత, రాష్ట్ర పార్టీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, ఎస్‌టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు కె. గోపి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు హబీబ్ మహ్మద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రాచారి, మండూరి సాంబశివరావు, భిక్షపతి ముదిరాజ్, సుభాషిణి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీశైలం మహానంది, తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరెడ్డి,పార్టీ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భంగా విజిల్స్ ఊదుతూ….డప్పులు మోగిస్తూ చంద్రబాబుకు సంఘీభావంగా తమ నిరసన తెలిపారు.

Kasani

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News