Saturday, April 20, 2024

నారా లోకేష్‌ అరెస్ట్.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

TDP MLC Nara Lokesh

 

విజయవాడ: టిడిపి జనరల్ సెక్రటరీ, ఎంఎల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎంఎల్ఎ గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో పాల్గొని తిరిగొస్తుండగా.. కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులను టిడిపి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతారణం ఏర్పడింది. తనను అరెస్ట్ చేయడంపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఏ కారణంతో తనను అరెస్ట్ చేస్తారని లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. లోకేష్‌తో పాటూ ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర‌తో పాటూ మరికొందరు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

లోకేశ్ రాస్తారోకో వైపు వెళ్తున్నాడని, అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా అరెస్టు చేశారని లోకేష్‌ అనుచరులు మండిపడుతున్నారు.

TDP MLC Nara Lokesh arrest at Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News