Sunday, June 16, 2024

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఎపి పోలీసులు

- Advertisement -
- Advertisement -

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం కేసులో వైసిపి ఎంఎల్‌ఎ పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిపై ఎపి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపిసి 143, 147, 448, 427, 353, 453, 452, 120 బి, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు. హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఎపి పోలీసులు గాలిస్తున్నారు.

అరెస్టుపై హైడ్రామా!
ఎంఎల్‌ఎ పిన్నెల్లి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. హైద్రాబాద్‌తో పాటు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పరిసరాల ప్రాంతా ల్లో గట్టి నిఘా వేశారు. ఎంఎల్‌ఎ రామకృష్ణారెడ్డి తనకున్న పరిచయాల ద్వారా తప్పించుకుని తిరుగుతున్నారని, అతని తమ్ముడు, కారు డ్రైవర్ కూడా అతని వెంట ఉన్నారని గుర్తించారు. ఈ తరుణంలో ఎపి పోలీస్‌లకు పక్కా సమాచారం అందడంతో పటాన్‌చెరు సమీపంలోని ఇస్నాపూర్ వద్ద ఒక కంపెనీ గెస్టు హౌస్‌లో రామకృష్ణారెడ్డి అరెస్టు చేయడానికి రాగా, తన కారును వదిలి రామకృష్ణారెడ్డి పారిపోయారని తెలిసింది. అయితే కారు డ్రైవర్‌ను పోలీస్‌లు విచారించగా, రామకృష్ణారెడ్డి సంగారెడ్డి వైపు వచ్చారని, పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలుసు కుని కారులోనే సెల్ ఫోన్‌ను వదిలి వెళ్లినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే రామకృష్ణారెడ్డితో పాటు అతని తమ్ముడు, డ్రైవర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నా రని, జాతీయ రహదారిపై ఉన్న కంది సిసిఎస్‌కు తరలించారని భావిస్తున్నారు. మీడియా అక్కడికి చేరుకుని ఆరా తీసినప్పటికీ పోలీసులు ఎలాం టి సమచారం ఇవ్వలేదు. సంగారెడ్డి పోలీస్‌లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మొత్తమ్మీద మాచర్ల ఎంఎల్‌ఎ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో, అటు ఉభయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ విధంగా తొలుత పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం సాగిం ది. కానీ అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ తర్వాత ఎపి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News