Tuesday, September 17, 2024

తీన్మార్ మల్లన్నకు బెయిలు!

- Advertisement -
- Advertisement -
పీర్జాదిగూడలో విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుళ్లను మల్లన్న అనుచరులు అపహరించారని పోలీసుల ఆరోపణ

హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ వెబ్ ఛానెల్ యజమాని తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చింతపండుకు మల్కాజిగిరిలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మల్లన్న ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆయన పరివార జనులను వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు, హేళన చేస్తుంటాడు. అతడు మార్చి 22 నుంచి జైలులో ఉన్నాడు.

ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను బలవంతంగా అపహరించిన ఆరోపణపై నలుగురు వ్యక్తులతో సహా మల్లన్నను కూడా మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో ఇద్దరు పోలీసులపై భౌతిక దాడులు చేసిన ఆరోపణలు కూడా మల్లన్నపై ఉన్నాయి. పీర్జాదిగూడలో తాము విధుల్లో ఉండగా మల్లన్న అనుచరులు తమను అపహరించారని ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు తెలిపారు. తమ ఐడి కార్డులు చూపినా కూడా వారిని వేధించారని సమాచారం. మల్లన్న మీద ఐపిసి సెక్షన్లు 363, 342, 395, 332, 307, 34 కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News