Friday, May 3, 2024

చివరి మడికి గోదావరి జలాలు..

- Advertisement -
- Advertisement -

భువనగిరి: 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మడికి సాగు జలాలను అందిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం 16 ప్యాకేజీ కి బునాది గానీ కాలువను అనుసంధానం చేపట్టగా ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఆత్మకూరు(ఎం) మండలం వరకు స్వంత నిధులతో చేపట్టిన పనులను కాళేశ్వరం 16 వ ప్యాకేజీ ఈఈ ఖుర్షీద్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నృసింహసాగర్ (బస్వాపూర్) జలాశయం మెయిన్ రెగ్యూలేటర్ వద్ద నుంచి ప్రారంభమైన ప్రధాన దిగువ కాలువ భువనగిరి ఆరోరా కళాశాల మీదుగా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ నుంచి రాయగిరి కలెక్టరేట్ కార్యాలయం గుండా కేసారం, పెంచికల్పహాడ్, రామచంద్రాపురం, తుక్కాపురం, చందుపట్ల, గౌసనగర్ గ్రామాలను తాకుకుంటూ ఎర్రబెల్లి వద్దకు చేరుకుంటుందన్నారు. ఎర్రబెల్లి వద్ద మరో క్రాస్ రెగ్యూలేటర్ నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ (ఓటీ-5) నిర్మించాలని ప్రతిపాదించామని. ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ బునాదిగానీ కాల్వకు కలిపామన్నారు. ఈ కాలువ వీరవెల్లి గ్రామాన్ని తాకుతూ మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి శివారు గుండా నాంచారి పేట నుంచి ఆత్మకూరు(ఎం) చేరుకుంటుందని చెప్పారు.

ఓటి- 5 కెనాల్ ద్వారా…
గతంలో మూసీ నీటిని ఆయా మండలాలకు అందించాలనే లక్ష్యంతో బునాదిగానీ కాల్వ నిర్మాణం చేపట్టామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదని, అయితే ఇప్పుడు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసిన్నట్లు తెలిపారు. ఓటీ-5 కెనాల్ వీరవల్లి వర్ష బునాదికానీ కాల్వ, కాళేశ్వరం ప్యాకేజీ-16 రెండు సమాంతరంగా వస్తున్నాయన్నారు. ఇప్పటికే బునాదిగానీ కాల్వ ఉన్న నేపథ్యంలో రెండు కాల్వలను అనుసంధానం చేసిన్నట్లు తెలిపారు. కాళేశ్వరం జలాలతో. భూములన్నీ సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో బునాదిగానీ కాల్వలోనే గోదావరి జలాలను త్వరలో విడుదల చేసి మోటకొండూర్, ఆత్మ కూరు మండలాల ఆయకట్టు రైతులకు సాగు జలాలను అందజేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News