Sunday, April 28, 2024

రేవంత్ ఇలాకాలో ఆగమాగం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపిగా ప్రాతినిత్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఎంపిగా రేవంత్‌రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తే ఎనాడు కూడ క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు అందుబాటులో లేకపోవడం… పార్లమెంట్ పరిధిలో అభివృద్ధ్దికి పెద్దపీట వేయకపోవడంతో జనం గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేకపోవడం సైతం పార్టీకి సమస్యగా మారింది.

మేడ్చల్‌లో బిఆర్‌యస్ పార్టీ అభ్యర్థ్ది మల్లారెడ్డిని తట్టుకునే నాయకుడు కరువయ్యారు. స్థానిక నేతలు జంగయ్య యాదవ్…. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలలో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న మల్లారెడ్డిని తట్టుకుని విజయం సాధించడం అయ్యే పని కాదు. మాజీ ఎమ్మెల్యేపై ఆశలు పెట్టుకుని రాకకోసం ఎదురుచూస్తున్నారు. మల్కాజ్‌గిరిలో మైనంపల్లిపై ఆశలు పెట్టుకున్నారు. ఉప్పల్‌లో వర్గపోరు రోడ్లపై పడి తన్నుకునే స్థాయిలో ఉంది.

రాగిడి లకా్ష్మరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డిలలో ఒకరికి టికెట్ దక్కిన అధికార పార్టీ అభ్యర్ది బిఎల్‌ఆర్ ను తట్టుకుని గెలవడం సాద్యం అయ్యే పనికాదని ప్రచారం జరుగుతుంది. కూకట్‌పల్లి,కుత్బుల్లాపూర్‌లలో సిట్టింగ్ శాసనసభ్యులను తట్టుకుని విజయం వైపు పార్టీని నడిపించే నేతలు మాత్రం హస్తం పార్టీకి కరువయ్యారు. టికెట్ కోసం మాత్రం పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన సిట్టింగ్ శాసనసభ్యులు అర్ధిక,అంగ బలాల ముందు వారు కనుచూపుల్లో లేరు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సిట్టింగ్ శాసనసభ్యులకు కనీసం పోటి ఇచ్చే అశావాహూలు లేరని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News