Saturday, May 11, 2024

తేలని టికెట్ల పంచాయితీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రంగారెడ్డి ప్రతినిధి: హస్తం పార్టీలో సీట్ల పంచాయతీ ముదురుతుంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలోని ఆశావాహూలలో టెన్షన్ పెరుగుతు స్వంత పార్టీ నేతలపై విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల పర్వం ప్రారంభించారు. టికెట్ వస్తే పోటి చేస్తా… లేకపోతే మరోపార్టీలోకి పోయి టికెట్ తెచ్చుకుంటా అంటు అంతర్గత సమావేశాల్లో కొంత మంది ఆశావహూలు స్పష్టం చేస్తు హల్‌చల్ చేస్తున్నారు. వర్గపోరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల ప్రవర్తన మాత్రం మారడం లేదు.

ఉమ్మడి జిల్లాలోని 17 శాసనసభ స్థానాల్లో నాలుగైదు స్థానాల్లో మాత్రం అభ్యర్థ్దులపై స్పష్టత వచ్చిన మెజారిటి నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక పార్టీకి సవాల్‌గా మారింది. అధికార బిఆర్‌యస్ పార్టీని డికొనే కనీస సత్తా లేని వారు సైతం ఒక్కో సీటుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించుకోవడంతో పాటు పోటికి సై అంటు సవాల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కొడంగల్ రేవంత్ రెడ్డి, వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పరిగిలో మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి సీట్లపై స్పష్టత ఉన్న మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థ్దుల ఎంపిక కత్తిమీద సాములగానే మారింది.

టికెట్‌ల పంచాయతీ గాంధీభవన్ నుంచి డిల్లీకి మారడంతో జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల నాయకులు ఇప్పటికే ఢిల్లీకి తమకు కలిసిన నేతల వద్ద గోడు చెప్పుకునే వచ్చారు తప్ప సీట్లపై గ్యారంటి మాత్రం రాలేదు. తమకు టికెట్ కావాలని కొంత మంది నేతలు ఢిల్లీలో అడగగా మరికొంత మంది లోకల్ నాన్ లోకల్ పంచాయతీలు పెట్టివచ్చారు. చెవెళ్ల ఆశావాహూలు ముగ్గురు కలిసి తమలో ఎవరికైన టికెట్ ఇవ్వాలి కాని ఇతరులకు ఇవ్వవద్దని ఫిర్యాదు చేయగా ఎల్.బి.నగర్ నేతలు సీనియర్ నేత, మాజీ ఎంపి మదుయాష్కికి టికెట్ ఇవ్వవద్దని ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇబ్రహింపట్నం సీటు పంచాయతీ కాకరేపుతుంది. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి టి కెట్ ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతున్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయుడు మర్రి నిరంజన్‌రెడ్డి, దండెం రాం రెడ్డి లాంటి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తు టెన్షన్ పెడుతున్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చిన మరోకరు ఇతర పార్టీలు…ఇతర వ్యక్తులకు మద్దత్తు తెలపడం ఖాయంగా కనిపిస్తుంది. షాద్‌నగర్ సీటు వీర్లపల్లి శంకర్‌కు ఖాయమని ప్రచారం జరుగుతున్న వలసనేతలపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు. చెవెళ్ల, ఎల్.బి.నగర్, ఇబ్రహింపట్నం, మహేశ్వరం సీట్ల పంచాయతీ పార్టీలో అలజడి రేపడం…రోడ్డున పడటం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News