Thursday, May 2, 2024

నేడే ఓట్ల పండుగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని సాయంత్రం 5 గంటలకే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని డిఆర్‌సి కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది ఇవిఎంలను తీసుకొ ని ప్రత్యేక పోలీసు బలగాల బందోబస్తు మధ్య పోలింగ్ స్టేషన్లకు వెళ్లారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎ న్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అభ్జర్వర్లు ్ల, స్కాడ్స్‌ను ఎన్నికల సంఘం నియమించింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ అధికారులు మా క్ పోలింగ్ ఆయా పార్టీ ఏజెంట్లతో నిర్వహించి 7 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్రాల్లో ముందుగా ఓటింగ్‌ను ఎన్నికల ఏజెంట్లుతో ప్రారంభిస్తారు. బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పోలింగ్ ప్రక్రియ ఏ ర్పాట్లను ఎప్పటికప్పడు  పరిశీలిస్తున్నారు.

అందులో భాగంగా యూసుప్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిఆర్‌సి కేంద్రాలను సందర్శించి ఆర్వోలను అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం లెక్కించేందుకు అదనపు ఎన్నికల అధికారులను నియమించారు. వారు సాయంత్ర ం వరకు ఐదుసార్లు నమోదైన పోలింగ్ వివరాలను జిల్లా అధికారులకు తెలియజేస్తారు. పోలింగ్ సమయం ముగిసిన సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన ఓటర్లను కేంద్రంలో వరుసలో ఉంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రం గేట్లు మూసి క్యూ లో ఉన్న ఓటర్లను మాత్రమే తమ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత సెక్టార్ అధికారుల ఆధ్వర్యంలో డిఆర్‌సిలకు ఇవిఎంలు తరలిస్తారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి 21,686 వీల్‌చైర్లు సిద్ధం చేశారు. బ్రెయిలీ లిపిలోను ఓటరు స్లిప్పులు నమూనా బ్యాలెట్లు ఉంచారు. అదేవిధంగా ఎన్నికల కేంద్రాలకు సెల్‌పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, ఎన్నికల సెంటర్‌లోకి వచ్చే అభ్యర్థికి ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని, ఇతర వాహనాలు పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ తరువాత అవసరమైతే అభ్యర్ధుల అనుచరులు ఈవిఎం వాహనాల వెంట గోదాముల వరకు వెళ్లవచ్చన్నారు.

ప్రజలు ఓట్లు వేయడానికి ఎపిక్ కార్డు లేకుంటే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ద్వారా వేయవచ్చని తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేయాలని ఎన్నికల గడువు ముగియక ముందే చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇసి హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను కేంద్రాల సమీపంలో చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. గత వారం రోజుల నుంచి స్దానిక బిఎల్‌ఓలు ఓటర్లకు ఓటింగ్ వేసే విధానం గురించి వివరించి ఓటరు స్లిప్పులు, ఎపిక్ కార్డులు అందజేశారు.

ఎన్నికలకు సంబంధించి కొన్ని వివరాలు….
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు దాదాపు పది లక్షల మంది ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో 2,290 మంది బరిలో ఉన్నారు. పురుషులు 2,068 కాగా మహిళలు 221 మంది. ఒక ట్రాన్స్ జెండర్ పోటీలో నిలబడ్డారు. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది.
డిసెంబర్ 1వ తేదీన రీపోలింగ్, 4న రీకౌంటింగ్ ః
రాష్ట్రంలో ఎక్కడైన పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, గొడవలు జరిగితే సిసి కెమెరాల ద్వారా అధికారులు గుర్తించి జిల్లా ఎన్నికల అధికారికి వివరాలు అందజేస్తే మరుసటి రోజు డిసెంబర్ 1వ తేదీన రీపోలింగ్, లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని సాయంత్రం 5 గంటలకే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని డిఆర్‌సి కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది ఇవిఎంలను తీసుకొని ప్రత్యేక పోలీసు బలగాల బందోబస్తు మధ్య పోలింగ్ స్టేషన్లకు వెళ్లారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అభ్జర్వర్లు ్ల, స్కాడ్స్‌ను ఎన్నికల సంఘం నియమించింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

గురువారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ అధికారులు మాక్ పోలింగ్ ఆయా పార్టీ ఏజెంట్లతో నిర్వహించి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్రాల్లో ముందుగా ఓటింగ్‌ను ఎన్నికల ఏజెంట్లుతో ప్రారంభిస్తారు. బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను ఎప్పటికప్పడు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా యూసుప్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిఆర్‌సి కేంద్రాలను సందర్శించి ఆర్వోలను అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం లెక్కించేందుకు అదనపు ఎన్నికల అధికారులను నియమించారు. వారు సాయంత్ర ం వరకు ఐదుసార్లు నమోదైన పోలింగ్ వివరాలను జిల్లా అధికారులకు తెలియజేస్తారు. పోలింగ్ సమయం ముగిసిన సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన ఓటర్లను కేంద్రంలో వరుసలో ఉంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రం గేట్లు మూసి క్యూ లో ఉన్న ఓటర్లను మాత్రమే తమ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ ముగిసిన తరువాత సెక్టార్ అధికారుల ఆధ్వర్యంలో డిఆర్‌సిలకు ఇవిఎంలు తరలిస్తారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి 21,686 వీల్‌చైర్లు సిద్ధం చేశారు. బ్రెయిలీ లిపిలోను ఓటరు స్లిప్పులు నమూనా బ్యాలెట్లు ఉంచారు. అదేవిధంగా ఎన్నికల కేంద్రాలకు సెల్‌పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, ఎన్నికల సెంటర్‌లోకి వచ్చే అభ్యర్థికి ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని, ఇతర వాహనాలు పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ తరువాత అవసరమైతే అభ్యర్ధుల అనుచరులు ఈవిఎం వాహనాల వెంట గోదాముల వరకు వెళ్లవచ్చన్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి ఎపిక్ కార్డు లేకుంటే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ద్వారా వేయవచ్చని తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేయాలని ఎన్నికల గడువు ముగియక ముందే చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇసి హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను కేంద్రాల సమీపంలో చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదన్నారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. గత వారం రోజుల నుంచి స్దానిక బిఎల్‌ఓలు ఓటర్లకు ఓటింగ్ వేసే విధానం గురించి వివరించి ఓటరు స్లిప్పులు, ఎపిక్ కార్డులు అందజేశారు.

ఎన్నికలకు సంబంధించి కొన్ని వివరాలు….
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు దాదాపు పది లక్షల మంది ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో 2,290 మంది బరిలో ఉన్నారు. పురుషులు 2,068 కాగా మహిళలు 221 మంది. ఒక ట్రాన్స్ జెండర్ పోటీలో నిలబడ్డారు. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది.
డిసెంబర్ 1వ తేదీన రీపోలింగ్, 4న రీకౌంటింగ్ ః
రాష్ట్రంలో ఎక్కడైన పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, గొడవలు జరిగితే సిసి కెమెరాల ద్వారా అధికారులు గుర్తించి జిల్లా ఎన్నికల అధికారికి వివరాలు అందజేస్తే మరుసటి రోజు డిసెంబర్ 1వ తేదీన రీపోలింగ్, లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News