Sunday, April 28, 2024

చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకోనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని కల్వకుంట్ల వెంకటరాఘవరావు జిల్లా పరిషత్ హైస్కూల్ రూమ్ నెంబర్ -2 (పార్ట్ నంబర్ 158)లో గురువారం నాడు(నవంబర్ 30) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సిఎం కెసిఆర్ దంపతులు హెలికాప్టర్‌లో చింతమడకకు బయలుదేరి వెళ్లి అక్కడ ఓటు వేయనున్నారు. బుధవారం చింతమడకలో హెలిప్యాడ్‌ను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. కాగా, సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్‌లో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో మంత్రి హరీశ్‌రావు దంపతులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నందినగర్‌లో ఓటు వేయనున్న కెటిఆర్
బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ గురువారం బంజారాహిల్స్, నందినగర్‌లోని జిహెచ్‌ఎంసి కమ్యూనిటీ హాలులో 124 నెంబర్ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం 7.45 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బిఎస్ డిఎవి పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News