Friday, May 10, 2024

2023 జనవరిలో తెలంగాణ నిఘంటువును విడుదల: జూలూరి

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నిఘంటువును అధికారికంగా విడుదల చేయడమే ప్రస్తుతం తమ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరి శంకర్ అన్నారు. ఈ మేరకు నిఘంటువు పునర్నిర్మాణ పనులు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. నిఘంటువు ఆవిష్కృతమవ్వడానికి ఒక సంవత్సరం సమయం పడుతుందని, 2023 జనవరిలో తెలంగాణ నిఘంటువు విడుదలయ్యే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తమ తమ నిత్య జీవితంలో మాట్లాడే వాడుక భాష మాటలను ఆ నిఘంటువులో జోడించే విధంగా కృషి చేశామన్నారు.

పల్లె భాషలో ఎన్నో తేట తెలుగు పదాలు తెలంగాణ యాసలో ఉన్నాయని, అవి మన మాతృభాషకు అసలైన వన్నె తీసుకొస్తాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉధ్యమంలో తెలుగు భాషలో ఇక్కడి యాస యొక్క విలువను, దాని వల్ల వచ్చిన చైతన్యాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నిఘంటువు నిర్మాణంలో భాగంగా తమిళనాడులోని తంజాఊరు గ్రంధాలయం వారు తమ వంతు సహకారంగా అక్కడున్న పురాతన తెలంగాణ నిఘంటువును అందజేశారని, అందులోని సారాంశాన్ని కూడా నిఘంటువు నిర్మాణంలో వాడతారని తెలియజేశారు. గ్రంధం పూర్తి అవ్వగానే భారీ ఎత్తున తెలంగాణ నిఘంటువుని విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News