Saturday, July 27, 2024

పెన్షన్‌ల కోతపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

Pension

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై పెన్షనర్స్ జెఎసి నాయకులు లక్ష్మయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటిషనర్ తన పిటిషన్‌లో కోరారు. మే నెల పెన్షన్ కట్ చెయ్యకుండా పూర్తి పెన్షన్ వేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ హైకోర్టును కోరారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్‌వాదనలు వినిపిస్తూ పెన్షనర్లపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందని తెలిపారు. జూన్1 వరకు పూర్తి పెన్షన్ చెల్లించకపోతే అదే రోజు ఆదేశాలు జారీచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్ట్‌ జూన్1కి వాయిదా వేసింది.

గద్వాల గర్భిణి మృతిపై: గద్వాల గర్భిణి మృతి కేసులో అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఈ కేసుకు సంబంధించి న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు అధికారుల తీరును తప్పుబట్టింది. గర్బిణి మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం తీరుపై ఒక కమిటీ పర్యవేక్షించాలని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.

Telangana High Court hearing on pension cuts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News