Friday, April 26, 2024

తెలంగాణ మోడల్‌కు దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

వ్యవసాయంటే కేవలం పంటలు పండించడమే కాదు. పశుపోషణ, మత్స్య, మాంస ఉత్పత్తులను కూడా ప్రోత్సహించడం కూడా. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోంది. మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అయిదో స్థానంలో ఉంది. 2014లో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి 5.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. కుల వృత్తులకు ప్రోత్సాహంలో భాగంగా రూ.11,000 కోట్ల వ్యయం తో 7.3లక్షల యూనిట్ల గొర్రెలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి కొంత రుణం తీసుకొంది. ఆ సంస్థకు ఈ ఏడాది అసలు, వడ్డీల కోసం చెల్లించడానికి సుమారు రూ. 758 కోట్లు కేటాయించింది. ఒక్క సామాజిక వర్గం కోసమే ఇంత భారీ మొత్తంలో సొమ్ము వెచ్చించడాన్ని చిన్న విషయంగా పరిగణించలేం. చేపల పెంపకం విషయంలోనూ ఇంత కృషే జరుగుతోంది.

తెలంగాణ మోడల్.. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితికి ఇతర రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. మరి కెసిఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఆ మోడల్‌కు ప్రతిరూపంగాఉందా? జాతీయ స్థాయిలో ‘కిసాన్ సర్కార్’ వస్తే ఎలా ఉంటుందో నిరూపించేదిగా ఉందా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా ‘ఔను’ అన్న సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

కిసాన్ సర్కార్ అంటేనే సహజంగానే వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఉంటుంది. వ్యవసాయ రంగానికి ప్రాథమిక వనరు అయిన సాగునీటి రంగాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ ఏర్పడ్డ నాటికి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందే ది. ఇప్పుడది 73 లక్షల 33 వేల ఎకరాలకు పెరిగింది. సమీప భవిష్యత్తులో దాన్ని కోటీ ఇరవైఅయిదు లక్షల ఎకరాలకు పెంచుతామని ఈ బడ్జెట్‌లో ఘంటాపథంగా చెప్పారు.లక్ష్యాలపై స్పష్టత ఉండడమే ఈ బడ్జెట్ గొప్పతనం. అందుబాటులో ఉన్న జలవనరులను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఇందులో వివరణ ఉంది. కేవలం భారీ డ్యాములే కాకుండా, చెక్ డ్యామ్‌ల దగ్గర నుంచి చెరువుల పునరుద్ధరణ వరకు వీలయినన్ని వనరుల ద్వారా నీటిని ఉపయోగించుకోవడానికి కేటాయింపులు ఉన్నా యి. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. దీనినే కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ సరోవర్’ పేరుతో పథకంగా అమలు చేస్తోంది.

మిషన్ కాకతీయకు రూ. 5000 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సూచించినా కేంద్రం పట్టించుకోకపోవడం వేరే ముచ్చట. చెరువుల పునరుద్ధరకు రాష్ట్రం మాత్రం రూ.1,300 కోట్లు, నిర్వహణకు మరో రూ.380 కోట్లు ఇచ్చింది. రూ.3,825 కోట్లతో 1200 చెక్ డ్యాం లు నిర్మించడం కూడా కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో పథకం. ఎక్కడా నీటిని వృథా కానీయొద్దన్నదే ఈ భగీరథ ప్రయత్నంలో ప్రధాన ఉద్దేశం. నీటి పారుదల శాఖకు బడ్జెట్లో రూ. 26,885 కోట్లు కేటాయించారు. అందులో రూ. 15,220 కోట్లు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ కింద చెల్లిస్తారు. కేటాయింపుల్లో అధిక భాగం వడ్డీలకే పోతున్నందున నీటి ప్రాజెక్టులకు వాస్తవంగా ఇస్తున్నదేమిటన్నది ప్రధాన ప్రశ్నగా ముందు నిలిచింది. అంతా అప్పులమయం అయిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇవి సరికాదు. శాశ్వత ఆస్తులు సమకూర్చకోవడానికి రుణాలు చేయడం తప్పే మీ కాదు. నిపుణులు అంగీకరించినదే. సామాన్యులు సయితం ఇదే చేస్తారు. నిధులు సర్దుబాటు చేసే సమయంలో ఆస్తుల కల్పనకు అప్పులు తీసుకోవడం, ఇతర వ్యయాల కోసం సొంత నిధులు కేటాయించడం సహజంగా జరిగే ఆర్థిక ప్రక్రియే. ప్రభుత్వానికి మూడు వనరుల ద్వారా నిధులు సమకూరుతాయి.

పన్నులు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఆదాయం, రుణాలు.. ఈ రూపాల్లో ఆర్థిక వనరులు అందుతాయి. కెసిఆర్ ప్రభుత్వం అసలు పన్నుల భారాన్ని మోపడమే లేదు. జిఎస్‌టి రూఫంలో జాతీయ స్థాయిలో ఎంత పన్ను వేశారో అంతే తప్ప ఇతరత్రా పన్నుల మాటే లేదు. ఆర్‌టిసి, విద్యత్తు రంగం, మంచినీటి సరఫరా వంటి ప్రభుత్వ సంస్థలను ఆదాయ వనరులుగా అసలు చూడడమే లేదు. అందువల్ల వీటి ద్వారా ప్రభుత్వానికి పెద్దగా నిధులు సమకూరవు. ఇక రుణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అప్పులు వద్దనుకుంటే పన్నులు పెంచడమో, ప్రభుత్వరంగ సంస్థల ఛార్జీలను పెంచడమో చేయాల్సి ఉంటుం ది. అది ఇష్టం లేకనే రుణాల వైపు మొగ్గు చూపుతోంది. ఆ రుణం కూడా ప్రజల సొమ్మే. వారు ఆ సంస్థలు ఎవరికో ఒకరికి రుణంగా ఇవ్వకతప్పదు. ప్రభుత్వమే ఆ సొమ్మును అప్పుగా తీసుకుంటే ఉభయులకూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మార్గాన్నే రాష్ట్ర సర్కారు ఎంచుకొంది.

ఉదాహరణకు ఈ బడ్జెట్లో పీఎఫ్, చిన్నతరహా పొదుపు సంస్థల నుంచి రూ.19,768 కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించింది. ఇచ్చిన హామీ మేరకు సకాలంలో అసలు, వడ్డీలు చెల్లిస్తుండడం ఆర్థిక క్రమశిక్షణలో ఓ భాగం. అలా చేస్తేనే అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు నిధులు సమకూర్చుతాయి. ప్రాజెక్టులకే కాకుండా రైతులకు తక్షణ, ప్రత్యక్ష ప్రయోజనాలను కల్పించే రైతు బంధు, రైతు బీమా పథకాలకూ కేటాయింపులు పెరిగాయి. వ్యవసాయ యాంత్రికీకరణకే రూ.500 కోట్లు ఇచ్చారు. రైతు బంధు పథకాన్నే కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకంగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

వ్యవసాయంటే కేవలం పంటలు పండించడమే కాదు. పశుపోషణ, మత్స్య, మాంస ఉత్పత్తులను కూడా ప్రోత్సహించడం కూడా. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోంది. మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అయిదో స్థానంలో ఉంది. 2014లో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి 5.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. కుల వృత్తులకు ప్రోత్సాహంలో భాగంగా రూ.11,000 కోట్ల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి కొంత రుణం తీసుకొంది. ఆ సంస్థకు ఈ ఏడాది అసలు, వడ్డీల కోసం చెల్లించడానికి సుమారు రూ. 758 కోట్లు కేటాయించింది. ఒక్క సామాజిక వర్గం కోసమే ఇంత భారీ మొత్తంలో సొమ్ము వెచ్చించడాన్ని చిన్న విషయంగా పరిగణించలేం.

చేపల పెంపకం విషయంలోనూ ఇంత కృషే జరుగుతోంది. తెలంగాణ మోడల్లో మరో రెండు కీలక రంగాలు విద్యుత్తు, రహదారులు. వాటికి కూడా కేటాయింపులు పెరిగాయి. కేవలం రోడ్డు మరమ్మతులకే రూ.2,000 కోట్లు కేటాయించడం విశేషం. రహదారుల నిర్మాణంతో సరిపెట్టకుండా, వాటి నిర్వహణపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. రోడ్లు బాగులేక వాహనాలు నడపలేని దుస్థితి ఎన్నో రాష్ట్రాల్లో ఉంది. ఎన్నటికీ అలాంటి పరిస్థితి రాకూడదన్నదే బీఆర్‌ఎస్ సర్కారు లక్ష్యం.బడ్జెట్లో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం న్యాయ వ్యవస్థకు నిధుల కేటాయింపు. కోర్టుల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్.వి.రమణ పదేపదే గుర్తు చేసేవారు. జ్యుడీషియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. వాటని ఇతర ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకున్నాయో తెలియదు కానీ, బీఆర్‌ఎస్ సర్కారు మాత్రం అమల్లోకి తెస్తోంది. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కొత్త కోర్టుల ఏర్పాటుకు రూ.1,050 కోట్లు కేటాయించింది. 1,721 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయనుంది. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం ఇంకో విశేషం. ఇదే కూడా దేశమంతటా అనుసరించాల్సిన విధానం ‘రానున్న రోజుల్లో జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుంది’ అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘జాతి నిర్మాణం’ కోసం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వమే అడ్డుతగులుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది.

ఇందులో కేంద్ర వైఖరి కారణంగా నిధుల కోసం మళ్లీ ఫోరాటాన్ని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రుణాలు తీసుకోవడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తోంది. ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఏ రాష్ట్రం ఎంత రుణం తీసుకోవచ్చన్నది నిర్ణయిస్తారు. కేంద్రం మాత్రం తెలంగాణకు నిర్ణయించిన రుణ పరిమితిని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల శాశ్వత ఆస్తులుగా మారే అభివృద్ధి పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. రైతుల కోరిక మేరకు ఉపాధి హామీ నిధులతో కళ్లాలు నిర్మించడానికి కూడా అడ్డు చెబుతోంది. ఇలా కేంద్రం అడ్డుతగులుతున్న 19 సందర్భాలను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో సవివరంగా ప్రస్తావించారు. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలాంటింది. దీనిపై అందర్నీ కూడగట్టాల్సిన సమయం ఆసన్నమయింది. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ అవసరం ఇక్కడే ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ ఆ పార్టీ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేదిగా ఉంది.

గోసుల శ్రీనివాస్ యాదవ్
9849816817

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News