Thursday, May 2, 2024

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు…

- Advertisement -
- Advertisement -

Municipal-Election

హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు కమిషనరేట్ల పరిధిలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి, మోత్కురు, పెద్దఅంబర్‌పేటలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుగు గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, బండ్లగూడ జాగీర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి సిబ్బందిని అడిగి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ ఆర్డిఓ చంద్రకళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు 4,500మంది సిబ్బందిని ఎన్నికల బందోబస్తుకు కేటాయించారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని సిపిలు తెలిపారు. రాచకొండలో 1,283, సైబరాబాద్‌లో 726 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు.

సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. ఒకటి రెండు చోట్ల పార్టీల మధ్య వాగ్వాదం జరిగినా కూడా తర్వాత సద్దుమణిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. తెల్లాపూర్,మణికొండ, నార్సింగి, ఆమన్‌గల్, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్‌పల్లి, తూంకుంట, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చెల్, దుండిగల్, బండ్లగూడ జాగీర్, నిజాంపేటలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 26 స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, 26 ఫ్లైయింగ్ స్కాడ్‌లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయి.

Telangana Municipal Election Polling End

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News