బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. క్యూమ్‌లో నింబస్ మేఘాలతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్,
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.