Sunday, May 5, 2024

శానిటేషన్ హబ్

- Advertisement -
- Advertisement -

KTR

 ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు
మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం
‘ఇంక్ వాష్’ సమ్మిట్‌లో మంత్రి కెటిఆర్ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్ హబ్(ఎస్ -హబ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. ఈ శానిటేషన్ హబ్‌కు మూలధనంగా రూ. 25 కోట్లు నిధి గా కేటాయించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంక్ వాష్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా నీరు, పారిశుధ్యం, వ్యర్థ ఘనాల నిర్వహణా, నిరుపయోగకరమైన నీటిని శుధ్ధి చేయడం వంటి ప్రక్రియల ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇంక్యుబేటర్‌గా ఈ ఎస్ హబ్‌ను నెలకొల్పుతున్నట్టు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

ఎస్ హబ్ అనేది తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే ఒక మార్గనిర్దేశకంగా నిలువనున్నదని మంత్రి అభిలాషించారు. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో ఎస్ హబ్ అనేది ఉన్నతమైన ఆలోచనలను విజ్ఞానాన్ని వ్యాప్తి చెందిస్తూ, సామర్థంను పెంపొందించడానికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయాలనుకున్న ఎస్ హబ్‌ను రెండేళ్ళ పాటు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) వద్ద ఏర్పాటు చేయాలని, అనంతరం ప్రతిపాదిత సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక సదుపాయాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిచిందని మంత్రి వెల్లడించారు.

నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటుందని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో నీరు, పారిశుద్ధ్య ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కెటిఆర్ తెలిపారు. తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల(యుఎల్‌బి)లో బహిరంగా మల విసర్జన రహిత హోదాను సాధించాయని, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్దతిలో 71 పట్టణ స్థానిక సంస్థలు మల బురద శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

స్థానిక సంస్థలలోని గృహ వ్యక్తిగత నీటి కనెక్షన్‌లు, సురక్షితమైన పారిశుధ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో పౌరుల కేంద్రీకృత, ట్రస్ట్ ఆధారితమైనదిగా కొత్త మునిసిపల్ చట్టం ఉన్నదని, నీరు, పారిశుధ్య సేవలతో పాటు ఇతర మునిసిపల్ సేవలను, హక్కుల విధానాన్ని చట్టంలో పొందుపరిచినట్టు మంత్రి తెలిపారు.

Telangana to set up Sanitation Hub

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News