Monday, May 13, 2024

ముగ్గురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇప్పటికీ మురికి కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు చేశారు.

బైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్ మార్గంలో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. మరో వైపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. కాగా ఈశాన్య ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో వరద నీటిలో స్నానం కోసం దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు పిల్లలు కూడా 10నుంచి 12 ఏళ్ల లోపు వారు. ఢిల్లీ వరదల్లో మరణాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News