Monday, May 13, 2024

శనివారం రాశి ఫలాలు(06-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘసేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు.

వృషభం – అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.

మిథునం – బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని ఇస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు.

కర్కాటకం – విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి ధనలాభం పొందుతారు..

సింహం – ఉద్యోగ భాద్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు కలిగిస్తాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వస్తు సేకరణ.

కన్య – కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. మిత్రుల నుండి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు లాభాలు.

తుల – మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం – ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలు. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. శుభవార్తలు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సోదరుల నుండి ధనలాభం.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఋణవత్తిడులు కొంత వరకు తీరుస్తారు. సోదరుల నుండి సహాయ సహాకారలు అందుతాయి.

కుంభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం – ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News