Sunday, May 12, 2024

గురువారం రాశి ఫలాలు(22-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో సొంత మిత్రుల పరిచయాలు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం –ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. వస్తులాభం.

మిథునం –కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు

కర్కాటకం –కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తు వస్త్రకొనుగోలు.

సింహం – వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య –దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. విద్యావకాశాలు.

తుల –సంతానంనకు నూతన ఉద్యోగ లాభం పొందుతారు. పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. ధనలాభం.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు. వాహనయోగం.

ధనుస్సు –విద్యార్థులకు శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వస్తు లాభం.

మకరం –కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వాహన యోగాలు వృత్తి, వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.

కుంభం –నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు.

మీనం –ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News