Monday, May 20, 2024

ఫెడరల్ విధానాలకు పూర్తి వ్యతిరేకం:బివి రాఘవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పట్టణ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలపై జరిగిన చర్చాగోష్టిలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం షరతులు విధించి పట్టణాలకు నిధులు కేటాయిస్తామనడం ఫెడరల్ విధానాలకు పూర్తి వ్యతిరేకమని, అధికారాలను తమ చేతిలో కేంద్రీకరించుకోవడమేనని విమర్శించారు , ఆస్తిపన్ను, నీటి బిల్లు, యూజర్ చార్జీలు వసూలు చేస్తేనే నిధులు ఇస్తామనడం పూర్తి ప్రజా వ్యతిరేక చర్య అని , పట్టణ సంస్కరణలు పేరుతో పట్టణ అభివృద్ధి కంటే బడా కంపెనీలు లాభార్జన కోసమే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదంటూ చెప్పారు.

పేదలకు ఇళ్ల స్థలాల జాగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూ వ్యాపారం సాగిస్తున్నాయని, సంస్కరణలు సామాన్య జనానికి సౌకర్యాలు మెరుగుపరిచేలా, స్థానిక సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని ఉద్ఘాటించారు. పట్టణ విధానాల విశ్లేషకులుడా. దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ పట్టణ జనాభా సహజంగా పెరగడం కంటే ప్రభుత్వాలే పెంచుతున్నాయని, గ్రామాలను పట్టణాల్లో కలుపుతూ భూ వ్యాపారం చేస్తున్నాయని చెప్పారు.

వేల కోట్ల రూపాయలతో పట్టణాల అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పుకోవడమే తప్ప సామాన్య జనానికి అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని చెప్పారు. సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ నగరంలో పట్టణ సంస్కరణల పేరుతో ఇప్పటికే ఆస్తి పన్నులు పెంచారని, జిహెచ్‌ఎంసి కి అప్పులు పెరిగాయని, అభివృద్ధిలో పేదలకు, మరికివాడలకు స్థానం లేకుండా పోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచితేనే నిధులు ఇస్తామని చెప్పడం అప్రజాస్వామిక చర్యగా విమర్శించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News