మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆవిష్కరించనున్నారు.సెక్రటేరియట్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. రవీంధ్రభారతి వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ వైపు అనుమతించరు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. నిరంకారి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రవీంధ్రభారితి మీదుగా హెచ్‌డిఎఫ్‌సి వద్ద డైవర్ట్ చేసి ఇక్బాల్ మినార్, ఓల్డ్ బ్రిడ్జి లకిడికాపూల్ వైపు మళ్లిస్తారు.
ఎల్‌బి స్టేడియం వద్ద….మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8గంటల వరకు ఆంక్షలు
ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ మీదుగా బిజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
బషీర్‌బాగ్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ వైపు అనుమతించరు. బిజేఆర్ విగ్రహం మీదుగా ఎస్‌బిఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
సుజాతా స్కూల్ లేన్ నుంచి ఖాన్‌లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలను అనుమతించరు. సుజాతా స్కూల్ జంక్షన్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
రద్దీ ఉండే జంక్షన్లు…
వివి స్టాట్యూ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అంబేద్కర్ స్టాట్యూ, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంధ్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బిజేఆర్ స్టాట్యూ సర్కిల్, ఎస్‌బిఐ గన్‌ఫౌంఢ్రీ, అబిడ్స్ సర్కిల్, ఎఆర్ పెట్రోల్‌పంప్, నాంపల్లి, కెఎల్‌కే బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రద్దీగా ఉండనున్నాయి.
ఆర్‌టిసి బస్సులు…
రవీంధ్రభారతి మీదుగా బిజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్‌టిసి బస్సులు ఎల్‌బి స్టేడియం మేయిన్ గేట్ , ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్ వైపు వెళ్లకూడదు. ఎఆర్ పెట్రోల్ పంప్‌మీదుగా నాంపల్లి వైపు వెళ్లాలి.