Wednesday, April 24, 2024

హాజీపూర్ హత్యల కేసు.. ఈ నెల 27న తుది తీర్పు

- Advertisement -
- Advertisement -

Serial Killer Srinivasa Reddy

 

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో ఈ నెల 27న తీర్పును వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీ నాటికి ఒక హత్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్యకేసుల్లో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం నాడు నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులకు సంబంధించి గత కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా ఈనెల 8న డిఫెన్స్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే 8వ తేదీన ఒక కేసుకు సంబంధించన వాదనలు విన్న న్యాయస్థానం మరో రెండు కేసుల్లో వాదనలు వినిపించేందుకు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా మరోసారి వాదనలు వినిపించాల్సి ఉండగా డిఫెన్స్ తరపు న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించలేదు.దీంతో ఈనెల 27న తుది తీర్పు వెల్లడించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

ఇదిలావుండగా ఈ కేసులోని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.

Trial of Hajipur Murder case is over
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News