Tuesday, October 15, 2024

సిపిఎం కార్యాలయంలో ఏచూరికి నివాళులు

- Advertisement -
- Advertisement -

పార్టీ నేతలు, సోనియా, పవార్ ఇతరుల సంతాపం
భౌతిక కాయం స్థానిక ఎయిమ్స్‌కు అప్పగింత
వైద్య విద్యార్థుల పరిశోధనలకు అంకితం

న్యూఢిల్లీ : సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికి ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో తుది వీడ్కోలు ఘట్టం జరిగింది. ఏచూరి స్థానిక నివాసం నుంచి ఆయన భౌతిక కాయాన్ని స్థానిక ఎకెజి భవన్‌కు ముందుగా తరలించారు. లాల్ సలాం , ఏచూరి అమర్ హై నినాదాల నడుమ ఈ ప్రాంతంలో భావోద్వేగ దృశ్యాలు కన్పించాయి. ముందుగా అక్కడి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందా కరత్, పినరయి విజయన్ , ఎంఎ బేబీఇతరులు చేరుకుని నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కూడా ఇక్కడికి కొందరు పార్ట నేతలతో కలిసి చేరుకున్నారు. ఏచూరికి నివాళులు అర్పించారు. ఆప్ నేతలు సిసోడియా, సంజయ్ సింగ్ , ఎన్‌సిపి అధ్యక్షులు శరద్ పవార్ , ఆర్జేడి ఎంపి మనోజ్ ఝా కూడా ఇక్కడికి వచ్చి తుది వీడ్కోలు తెలిపారు.

గురువారం ఏచూరి కన్నుమూశారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్థానిక జెఎన్‌యూకు తరలించారు. ఈ విద్యాసంస్థకు ఆయనకు ఉద్యమాల అనుబంధం ఉంది. ఇక్కడనే ఉన్నత చదువులు సాగించారు. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ఏచూరి శాల్యూట్ చేశారు. తరువాత పార్థీవ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. బిజెపి సీనియర్ నేతలు కొందరు కూడా ఏచూరికి నివాళులు అర్పించారు. ఏచూరి కోరిక మేరకు అంత్యక్రియల ఘట్టం ఏదీ ఉండదు. సిపిఎం కార్యాలయం నుంచి ఆయన భౌతికకాయాన్ని నేరుగా ఎయిమ్స్‌కు తరలిస్తారు. వైద్య పరిశోధనలకు ఎంబిబిఎస్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తన శరీరం ఎయిమ్స్‌కు అప్పగించాలని ఏచూరి ముందుగా తన అంతిమ కోరిక తెలిపారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ సీనియర్ నేత గతించి పోయినా ఆయన నిర్జీవ శరీరం తరతరాల వరకూ పరిశోధకుల సేవలో తాను సైతంగా నిలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News