Sunday, October 6, 2024

టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం …. పోలీసులు కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం విధానానికి సంబంధించిన కేసులో బెయిలుపై నిన్న రాత్రి విడుదలైన కేజ్రీవాల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలతో , టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీస్‌లు కేసు నమోదు చేశారు. బాణసంచా కాల్పులపై ఢిల్లీలో నిషేధం ఉండడంతో కేసు నమోదైంది. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సివిల్ లైన్స్‌లో సిఎం కేజ్రీవాల్ నివాసం వెలుపల ఆప్ కార్యకర్తలు టపాసులు పేల్చారు.

దీంతోపాటు ఢిల్లీ లోని అనేక ప్రాంతాల్లోనూ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీస్‌లు శనివారం వెల్లడించారు. ఢిల్లీ నగరంలో కాలుష్య నియంత్రణ లక్షంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు గత సోమవారం ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుంది. తీహార్ జైలు నుంచి విడుదల కాగానే కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధించిందని చెప్పారు. దేశాన్ని బలహీన పరుస్తున్న విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News