Saturday, October 5, 2024

సీతారాం ఏచూరి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఇటీవల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన మరణించారు.

ఆయన మృతితో కమ్యూనిస్టు పార్టీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థిస్తున్నారు. కాగా చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో పెరిగారు. 2005 నుంచి 2017 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News