Thursday, March 28, 2024

స్థానిక సంస్థల ఎంఎల్‌సి పదవులకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

TRS candidates for MLC positions in local bodies

నేడు అధికారిక జాబితా ప్రకటన

ఉమ్మడి మహబూబ్‌నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ – ఎంసి కోటిరెడ్డి, ఉమ్మడి మెదక్ – డాక్టర్ మర్రి యాదవరెడ్డి, కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు

డిసెంబర్ 10న పోలింగ్.. 14న ఓట్ల లెక్కింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎం ఎల్‌సి ఎన్నికలకు మంగళవారం(నవంబర్ 23)తో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నెల 24న ఎంఎల్‌సి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా, డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మి ది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో రెండు స్థానాలు ఉండగా, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ,మెదక్, నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్‌సిలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు ల క్ష్మణరావు, భూపాల్‌రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పదవీ కా లం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీతో పూర్తి కానుంది. ఈ స్థానాల ను ంచి కొత్త వారిని ఎంఎల్‌సిలుగా ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో హై దరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News