Sunday, April 28, 2024

రాత్రి పోస్టుమార్టమ్

- Advertisement -
- Advertisement -

Telangana issued guidelines for Autopsies during night

రాష్ట్రంలో రాత్రి సమయంలోనూ శవపరీక్షకు మార్గదర్శకాలు జారీ

సూర్యాస్తమయం తర్వాత శవపరీక్షకు ఏర్పాట్లు
పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియో తీయాలి
అవయవదానానికి ఉపయోగకరం : వైద్యవిద్య డైరెక్టర్ డా.రమేశ్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి వేళ్లల్లో పోస్టుమార్టం నిర్వహించేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదివారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో నిర్వహించే ప్రతి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయాలని తెలిపారు. అనుమాస్పదంగా ఉన్నా, న్యాయపరమైన అవసరాలకు పోస్టుమార్టం వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించడం ద్వారా అవయవ దానానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News