Saturday, March 2, 2024

ఫ్యామిలీ, యూత్‌కు నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా ట్రైలర్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈనెల 13న ట్రైలర్‌ను విడుదల చేస్తుండగా… ఈనెల 23న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ “రియలిస్టిక్‌గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. కథలోని ఎమోషన్స్‌ను అర్థం చేసుకొని తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కానీ ట్రైలర్‌లో మంచి డైలాగ్స్ ఉన్నాయి.

ఉగాది పండగ సందర్భంగా మా సినిమా ట్రైలర్‌ను ఈనెల 13న విడుదల చేస్తున్నాం. ఈనెల 18న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశాము”అని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ “తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్‌లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామాను తీస్తానో లేదో తెలియదు. అందుకే నాకు ఉన్న అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను”అని చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కు నచ్చే మంచి సినిమా ఇదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు ప్రవీణ్, తిరువేర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Tuck Jagadish Trailer to release on April 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News