Friday, May 3, 2024

కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Telangana student suicide in Canada

మనతెలంగాణ/హైదరాబాద్: కెనడాలో తెలంగాణ విద్యార్థి గురువారం తెల్లవారు జామున ఓ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు కెనడాలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. ఈక్రమంలో గురువారం ఉదయం 4గంటల సమయంలో తాను నివాసముంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.కాగా ప్రవీణ్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశం వెళ్లి అక్కడ బలవన్మరణానికి పాల్పడటంతో ప్రవీణ్ రావు కుటుంబంతో పాటు అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదవులు అభ్యసించి ప్రయోజకుడవు తాడనుకున్న కొడుకు అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యాడని మృతుని కుటింబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana student suicide in Canada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News