Sunday, April 28, 2024

ఒకే రోజు మూడు హత్యలు

- Advertisement -
- Advertisement -

కార్మికనగర్‌లో చంపి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం..
మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకా రం… నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్‌నగర్, కార్మిక నగర్‌కు చెందిన మహమ్మద్ సిద్దిక్ (35) స్థానికంగా టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి సిద్దిక్‌ను హత్య చేసి అతడి ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి బయట తాళం వేసి వెళ్లారు. సిద్దికి భార్య రుబీనా, పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా సిద్దికి మృతదేహం ఫ్రిజ్‌లో ఉంది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై యాకన్న దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వివరాల గురించి స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, చిక్కడపల్లికి చెందిన సార్దర్ సత్నాం సింగ్(38) భార్యతో కలిసి బాగ్‌లింగంపల్లి, సూర్యనగర్‌లో ఉంటున్నాడు. నారాయణగూడలో పంజాబీ ఫుడ్ హౌస్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. కరోనా వల్ల వ్యాపారం సరిగా నడవకపోవడంతో అతడి భార్య బల్‌జిత్ కౌర్ సేవ చేయడానికి అఫ్జల్ గంజ్‌లోని గురుద్వారాలో గత కొన్ని రోజుల నుంచి ఉంటోంది. సత్నాం సింగ్ తన సమీప బంధువు నిషాన్ సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. రాత్రి భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన బల్‌జిత్ కౌర్ ఉదయం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.

అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా సత్నాం సింగ్ రక్తపు ముడుగులో పడి ఉన్నాడు. అదే సమయంలో తమ సమీప బంధువు నిస్సాన్ సింగ్ కన్పించ లేదు సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఎంఐఎం పార్టీ నాయకుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రత్యుర్థులు కత్తులతో నడిరోడ్డుపై హత్య చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, సిసి కెమెరాల ఆ ధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వ చ్చారు. మృతదేహాన్ని పో స్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News