Monday, May 13, 2024

సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two deaths from suffocation in septic tank

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం

హైదరాబాద్: సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతిచెందిన సంఘటన నగరం లోని గచ్చిబౌలిలో ఆదివారం చోటుచేసుకుంది. వారిని కాపాడేందుకు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకా రం.. గచ్చిబౌలిలోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమ దుర్గ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్‌కు ఫోన్ చేశారు. సంస్థ తరఫున సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేసేందుకు సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఇద్దరు కూలీలు అంజి (30), శ్రీను (32), క్లీనర్ జాన్, సెప్టిక్ ట్యాంక్ యజమాని స్వామి వచ్చారు. అంజి, శ్రీను ఇద్దరు క్లీన్ చేసేందుకు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. ఇద్దరికి ఊపిరి ఆడకపోవడంతో వారిని కాపాడేందుకు బయట ఉన్న జాన్, స్వామి లోపలికి దిగారు.

వారికి కూడా ఊపిరిఆడకపోవడంతో బయట ఉన్న వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ముందుగా ట్యాంక్‌లోకి దిగిన అంజి, శ్రీను లోపలే మృతిచెందారు. మృతులది నల్గొండ జిల్లా, దేవరకొండ మండలంలోని ఘాజీనగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సెప్టిక్ ట్యాంక్‌లో మృతిచెందిన ఇద్దరిని బయటికి తీశారు. అస్వస్థతకు గురైన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ యజమాని కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇద్దరు కూలీలు మృతి చెందారని పోలీసులు తెలిపారు. కాగా తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇద్దరు మృతులకు రూ.13లక్షల పరిహారం ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News