Monday, April 29, 2024

చరిత్ర సృష్టించిన ఉగాండా.. టి20 ప్రపంచకప్‌కు అర్హత..

- Advertisement -
- Advertisement -

ఆఫ్రికా దేశం ఉగాండా ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న టి20 ప్రపంచకప్‌నకు ఉగాండా అర్హత సాధించింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో రువాండాను ఓడించడం ద్వారా వరల్డ్‌కప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఉగాండా వరల్డ్‌కప్‌కు దూసుకెళ్లింది. మరోవైపు జింబాబ్వే టీమ్ ప్రపంచకప్ ఆశలు గల్లంతయ్యాయి. ఉగాండాతో పాటు నమీబియా కూడా వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News