Monday, April 29, 2024

ఆ విద్యార్థులకు ట్రీట్‌మెంట్ చేస్తాం

- Advertisement -
- Advertisement -

Sanjeev-Balyans

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అక్కడి విద్యార్థులకు తగిన చికిత్స ఇస్తామని కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ చెప్పారు. జెఎన్‌యు, జామియాలో పశ్చిమ యుపి విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందరికీ తగిన చికిత్స చేస్తామని, అక్కడ వారు చదువును మరిచిపోవడం ఖాయమంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపైన ఎవరూ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయబోరని ఆయన వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జెఎన్‌యు, జామియాలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు ఈ విధంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

Union Minister Sanjeev Balyans controversial remarks, He offers to give treatment to JNU, Jamia students if 10 percent reservation is provided to West UP students in those universities

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News