Wednesday, April 17, 2024

అన్నం పెట్టే రైతుకు ఇంత గోసనా?

- Advertisement -
- Advertisement -

పండగ పూట ఎరువుల ధరలు 50 నుండి 100 శాతానికి పెంచడం న్యాయమా ?
పెంచినధరలు తగ్గించాలని రాష్ట్ర బిజెపి నేతలు కే్ంరద్రాన్ని డిమాండ్ చేయాలి
సిఎం కెసిఆర్ రాసిన లేఖపై కేంద్రం తక్షణం స్పందించాల్సిందే
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Minister Vemula said should submit a report for cm on job vacancies

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కేంద్రం గోస పుచ్చుకుంటున్నదని విమర్శించారు. బడా వ్యాపారవేత్తలు, పెట్టుబడి దారుల కోసమే నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. రైతుల పాలిట భారంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేసేందుకు దేశ రైతన్నలు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోందని పేర్కొంటూ మోడీ సర్కార్‌ను, బిజెపి వైఖరిని ప్రశ్నిస్తూ శుక్రవారం ఆయన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో కేందంపైమరో రైతు ఉద్యమానికి త్వరలో నాంది పడబోతుందన్నారు ఆ లేఖలో మంత్రి పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారన్నారు. అందుకే ఆయనకు వ్యవసాయమన్న,రైతులన్న అమితమైన ప్రేమ అని అన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్ర వ్యవసాయం స్వరూపమే పూర్తిగా మారిపోయిందన్నారు. కరువుతో అల్లాడిన నేల ప్రస్తుతం పచ్చని పైరులతో,ధాన్యపు రాశులతో కళకళలాడుతోందోన్నారు. దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా అనతి కాలంలోనే తెలంగాణ అవతరించిందన్నారు. కానీ రైతులను ఆదుకోవడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతును అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. తమ కార్పొరేట్ మిత్ర శక్తుల ప్రయోజనం కోసం దేశ వ్యవసాయాన్ని, అన్నదాతల బ్రతుకులను తాకట్టు పెడుతోందని విమర్శించారు. రైతులను కూలీలుగా మార్చే కుట్రలకు తెరతీసిందని ధ్వజమెత్తారు. పంట మద్దతు ధరపై కేంద్రం స్పష్టత నివ్వదు…వ్యవసాయ పనిముట్ల రేట్లు పెంచి పన్నులు వేస్తున్నరన్నారు. పండగల పూట ఎరువుల ధరలు 3 నెలల కాలంలోనే 50 శాతం నుండి 100 శాతానికి పెంచి రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన రైతులను తొక్కి చంపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతును పూర్తి అగాధంలోకి నెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు.

మోసపోతే…గోస పడతాం

కేంద్రం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను రైతులు ఎక్కడికక్కడ బిజెపిని నిలదీయాలని ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి వేమూరి పిలుపునిచ్చారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణకుకి ప్రథమ ద్రోహులన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయాన్ని కేంద్రంలోని బిజెపి సర్కార్ రాజకీయ కోణంలో చూస్తోందన్నారు. దమ్ముంటే బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై రైతన్నలు ఆలోచన చేయాలన్నారు. వాటిపై మరోపోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News