Sunday, April 14, 2024

ఫోన్ చేయించి… కూతురి లవర్‌ను చంపిన తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

లక్నో: యువతి పెళ్లికి ఆమె లవర్ అడ్డుపడుతుండడంతోనే అతడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుష్పేంద్ర యాదవ్ అనే వ్యక్తి అగ్రాలో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పుష్పేంద్రకు 20 ఏళ్ల డాలీ అనే యువతి పరిచయమైంది. ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యువతి తండ్రి అవదేశ్ యాదవ్ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు.

ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.  యువతి పెళ్లికి పుష్పేంద్ర అడ్డుపడడంతో అతడిని హత్య చేయాలని డాలీ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. యువతితో ఫోన్ చేయించి ఇంటికి రమ్మని కబురుపంపాడు. ఇంట్లోకి రాగానే యువతి కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని కొట్టి చంపారు. మృతదేహాన్ని కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తగలబెట్టారు. స్థానికుల సమాచార మేరకు పోలీసులు కాలిపోయిన కారు వద్దకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పుష్పేంద్ర గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా డాలీ కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు తేలింది. మథురలో భూరా గ్యాంగ్ హత్యలు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతోంది. భూరా గ్యాంగ్‌లో అవదేశ్ సభ్యుడిగా ఉన్నాడు. డాలీ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News