Friday, May 17, 2024

నేడే వైకుంఠ ఏకాదశి

- Advertisement -
- Advertisement -

Vaikuntha Ekadasi

 

అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారం ముస్తాబు

దేదీప్యమానంగా ఆలయాలు, తెల్లవారుజాము నుంచే దర్శనానికి ఏర్పాట్లు

హైదరాబాద్ : నేడు (సోమవారం) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించగా, కమిషనర్ అనిల్‌కుమార్ రెండు, మూడురోజులుగా ఆయా ఆలయాల ఈఓలతో ఏర్పాట్లకు సంబంధించి తగిన సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు దర్శనానికి సంబంధించి ప్రతి దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అందులో భాగంగానే ప్రతి ఆలయాన్నీ పూలతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.

విదేశాల నుంచి వివిధ రకాల పూల దిగుమతి
నగరంలో భారీ సంఖ్యలో దేవాలయాలు ఇప్పటికే దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ముస్తాబు చేస్తున్నారు. ఆలయాల ముస్తాబుకు దేశ, విదేశాల నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకున్నారు. నగరంలోని ప్రముఖ దేవాలయాలైన హిమాయత్‌నగర్ టిటిడి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరాలయం, బిర్లామందిర్, జియాగూడ శ్రీరంగనాథ ఆలయం, శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమం, సికింద్రాబాద్‌లోని కోనేరు వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయా లతో పాటు తదితర ప్రాంతాల్లోని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇక అన్నిఆలయాల్లో సోమవారం దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మాసబ్‌ట్యాంక్ పింఛన్ ఆఫీసు వద్ద ఉన్న వెంకటేశ్వర ఆలయానికి లక్ష నుంచి రెండు లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ మెంబర్లు కళ్యాణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, అర్చకులు చైతన్యలు తెలిపారు.

యాదాద్రిలో ఉదయం 6.46 ని.లకు దర్శనం
యాదాద్రి ఆలయంలో ఉదయం 6.46 నిమిషాలకు బాలాలయం ప్రధాన ద్వారం ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అర్జిత సేవలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భద్రాద్రి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు
సోమవారం వైష్ణ, శివారాధకులు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని, వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు తెల్లవారు జాము నుంచే భగవద్ధర్శనం కోసం వేచిఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్ర వచనాలు, ప్రసంగాలు ఉంటాయి. దీంతో పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. అందుకే తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తుతుంటారు.

 

Vaikuntha Ekadasi today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News