Saturday, May 4, 2024

పురపోరే పొత్తుల్లేవు

- Advertisement -
- Advertisement -

 Municipal Elections

 

ఒంటరి పోటీకే ప్రధాన పార్టీల మొగ్గు

హైదరాబాద్ :త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో ఒంటరి పోరుకే ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునేందుకు అంతగా సుముఖంగా లేరని తెలుస్తోంది. స్థానికంగా తమ సత్తాను చాటుకునేందుకు ము న్సిపల్ ఎన్నికలను ఒక ఆయుధంగా మలుచుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే పొత్తులు లేకుండా సొంతంగా బరిలోకి దిగేందు కు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ పోరు అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రగిలిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా అక్కడక్కడ మున్సిపల్ పోరులో పరస్పరం సహకరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యం గా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్లు, వైస్ చై ర్మన్ల ఎంపికలో ఈ సహకారం మరింతగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నిక లు జరుగుతున్న 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు అధికార టిఆర్‌ఎస్ ఇప్పుటికే పలు వ్యూహాలను సిద్దం చేసిందని తెలుస్తోంది.

ఏ ఒక్క కార్పొరేషన్, మున్సిపాలిటిని కూడా ప్రతిపక్ష పార్టీలకు దక్కకుండా ఉండేందుకు టిఆర్‌ఎస్ అధిష్టానం అవసరమైన ప్రణాళికల రూపకల్పన కూడా చేసిందని సమాచారం. ఈ బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలంటే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవులను ప్రతిపక్ష పార్టీలకు అప్పచెప్పేందుకు కూడా టిఆర్‌ఎస్ సిద్దపడుతున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదారంగానే ఇచ్చిపుచ్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా టిఆర్‌ఎస్ మజ్లిస్‌పై ఆధారపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువే.

ఈ నేపథ్యంలో మజ్లిస్ పోటీ చేస్తున్న వార్డు లు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్ధులు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో పలు వార్డులు, డివిజన్లు మజ్లిస్ పార్టీ ఖాతాలో పడడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పూర్తిగా కైవసం చేసుకునే విషయంలో టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య స్థానికంగా కొంత సర్దుబాటు చేసుకోవడం కూడా తప్పదని రాజకీయవర్గాల్లో అప్పుడే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక టిఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు సైతం పరస్పరం సహకరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలా పైకి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేకపోయినప్పటికీ కీలకమైన పదవులను దక్కించుకునే విషయంలో మాత్రం స్థానిక సర్దుబాటు అన్ని పార్టీలకు తప్పనిసరిగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలలో ఎవరు ఎవరితో జతకడతారన్నది స్పష్టం కానుంది.

Lonely Competition in Municipal Elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News