Wednesday, April 24, 2024

కోటా ఖరారు

- Advertisement -
- Advertisement -

Municipal election reservation

 

మున్సిపల్ చైర్‌పర్సన్స్, కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు
13 మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌టి 1, ఎస్‌సి 1, బిసి 4, జనరల్ 7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్‌పర్సన్‌లలో ఎస్‌టి 4, ఎస్‌సి 17,
బిసి -40, జనరల్ 62 స్థానాలను కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి ప్రకటించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, కార్పొరేషన్ మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఆదివారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ సదర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 13 మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌టి 0-1, ఎస్‌సి 0-1, బిసి 0-4, జనరల్- 07 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్‌పర్సన్‌లలో ఎస్‌టి 0-4, ఎస్‌సి -17, బిసి -40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్‌పేట్ మేయర్ పదవి ఎస్‌టికి కేటాయించగా, రామగుండం మేయర్ పదవిని ఎస్‌సికి కేటాయించారు. జవహర్‌నగర్, బండ్లగూడ, నిజామాబాద్ కార్పొరేషన్ల మేయర్ పదవులను బిసిలకు కేటాయించినట్లు ఆమె వివరించారు. 128 మున్సిపాలిటీల్లో జడ్చర్ల, నకిరేకల్‌కు ఇంకా సమయం ఉందని, వివిధ కారణాలతో పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదని వివరించారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించామని శ్రీదేవి వెల్లడించారు.

ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లకు 2011 నాటి జనాభా లెక్కలను, బిసిలకు తాజా ఓటర్ల ప్రాతిపదికన రిజర్వ్ చేసినట్లు ఆమె చెప్పారు. కార్పొరేషన్లలో బిసిలు 34 శాతం నుంచి 35 శాతం వరకుండగా వారికి 35 శాతం కేటాయించారు. ఎస్‌సిలు 3.6 శాతమే ఉన్నప్పటికీ వారికి ఎనిమిది శాతం, అదే విధంగా ఎస్‌టిలు 1.9 శాతం మాత్రమే ఉన్నా వారికి 8 శాతం రిజర్వ్ చేశామని వివరించారు. ఇక మున్సిపాలిటీల్లో 32.5 శాతమున్న బిసిలకు 33 శాతం, 13 శాతమున్న ఎస్‌సిలకు 14 శాతం, 3.3 శాతమున్న ఎస్‌టిలకు 3.2 శాతం స్థానాలు దక్కనున్నాయని వెల్లడించారు. ఈ రిజర్వేషన్లు రాబోయే పదేండ్లకాలం పాటు వర్తించనున్నాయి. అనంతరం ఆమె రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై రిజర్వేషన్ల ఖరారుకు తీసుకున్న కొలమానాలు, ప్రమాణాలు వివరించారు. నాయకుల సమక్షంలో కార్పొరేషన్లలో 50 శాతం, మున్సిపాలిటీలలో 50 శాతం మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు.

బిసి రిజర్వుడు కార్పొరేషన్ మేయర్ స్థానాలు : 04

కార్పొరేషన్                                    బిసి రిజర్వుడు
బండ్లగూడ జాగీర్                               జనరల్
జవహర్ నగర్                                  మహిళ
నిజామాబాద్                                   మహిళ
వరంగల్                                        జనరల్

ఎస్‌టి రిజర్వుడు కార్పొరేషన్‌లలో మేయర్ స్థానాలు ఒకటి మీర్‌పేట. ఎస్‌సి రిజర్వుడు రామగుండం కార్పొరేషన

ఎస్‌టి రిజర్వుడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు : 04

మున్సిపాలిటీ                               ఎస్‌టి రిజర్వుడు
మరిపెడ                                       మహిళ
వర్ధన్నపేట్                                     మహిళ
డోర్నకల్                                       జనరల్
ఆమన్‌గల్                                     జనరల్

ఎస్‌సి రిజర్వుడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు : 17

మున్సిపాలిటీ                                ఎస్‌సి రిజర్వుడు
క్యాథన్‌పల్లి                                     జనరల్
బెల్లంపల్లి                                       జనరల్
మధిర                                          మహిళ
పరకాల                                        మహిళ
ఇబ్రహీంపట్నం                                 జనరల్
వైరా                                            జనరల్
ఐజ                                            జనరల్
పెబ్బేరు                                        మహిళ
నస్పూర్                                       జనరల్
అలంపూర్                                     మహిళ
నేరేడ్‌చర్ల                                       జనరల్
తొర్రూర్                                        జనరల్
వడ్డేపల్లి                                        మహిళ
భూపాల పల్లి                                   మహిళ
నార్సింగి                                        జనరల్
పెద్ద అంబర్‌పేట్                                మహిళ
తిరుమలగిరి                                   జనరల్

బిసి రిజర్వుడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు : 40

బిసి మహిళ రిజర్వుడు
సిరిసిల్ల
నారాయణపేట్
కోరుట్ల
సదాశివపేట
చండూరు
భీమ్‌గల్
ఆర్మూర్
కోస్గి
మెట్‌పల్లి
జగిత్యాల
సంగారెడ్డి
భైంసా
మక్తల్
పోచంపల్లి
సుల్తానాబాద్
ధర్మపురి
నర్సంపేట
కొల్లాపూర్
యాదగిరిగుట్ట
బోధన్

బిసి జనరల్ రిజర్వుడు
నారాయణ్‌ఖేడ్
ఆందోల్
జోగిపేట
గద్వాల
నిర్మల్
రాయికల్
ఎల్లారెడ్డి
మహబూబ్‌నగర్
పరిగి
వనపర్తి
అమరచింత
రామాయంపేట
చౌటుప్పల్
కొడంగల్
ఖానాపూర్
తూప్రాన్
మంచిర్యాల
బాన్సువాడ
ఆలేరు
భువనగిరి
నర్సాపూర్.

మహిళ జనరల్, ఆన్‌రిజర్వుడు మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు: 60

జనరల్ మహిళ
చొప్పండి,పెద్దపల్లి,వేములవాడ,కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూర్, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూర్, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్‌కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్,మంథని, హుజూర్‌నగర్, హుజూరాబాద్, శంకర్‌పల్లి, వికారాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట,కొత్తగూడెం, ఘట్‌కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్,కోదాడ,తుర్కయాంజల్, గుండ్లపోచంపల్లి.

జనరల్ ఆన్‌రిజర్వుడు
హాలియా, మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఇల్లెందు, అచ్చంపేట, భూత్పూర్, లక్షెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్, కల్వకుర్తి, నల్గొండ, షాద్‌నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిభట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్‌పూర్, మహబూబాబాద్, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తూముకుంట, బొల్లారం, మణికొండ, జిల్‌పల్లి, మిర్యాలగూడ.

Municipal election reservation finalized
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News