Saturday, July 27, 2024

తెలుగు భాష, సంస్కృతిని నేటి యువతకు తెలియజేయాలి

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu

 

హైదరాబాద్ : నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో ’తెలుగు వికీపీడియా’ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిజిటల్ విభాగం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా హార్దిక అభినందనలు చెబుతున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తెలుగు భాష అస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సంస్కృతి సాంప్రదాయాలు, సాహిత్యం, కళలు వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఈ సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలని అభిలాషించారు. ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తెలుగు వారిగా మనమంతా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మనకు లభించే విశ్వసనీయమైన సమాచారాన్ని ’తెవికీ’ ద్వారా అందరికీ అందించేలా కృషి చేయాలన్నారు.

 

Venkaiah Naidu praise on Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News